Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్ మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

ఎన్టీఆర్ మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ పాత్ర‌లో న‌ట విశ్వ‌రూపం చూపించాడు. కొర‌టాల శివ‌తో ఎన్టీఆర్ సినిమా అని ప్ర‌క‌టించి చాలా రోజులు అయ్యింది కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. దీంతో ఈ క్రేజీ మూవీ అప్ డేట్స్ కోసం యంగ్ టైగ‌ర్ అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఈ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. న‌వంబ‌ర్ సెకండ్ వీక్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. స్టోరీ విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమా కథాంశం గరుడ పురాణంలోని ఓ అంశం చుట్టూ సాగుతుందట.

అయితే.. కొరటాల గరుడ పురాణంలో ఏ పాయింట్ ను తీసుకుని కథ రాసుకున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. కథలో అయితే.. కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీను తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్