Wednesday, March 11, 2026
HomeTrending Newsఆరుగురు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవం

ఆరుగురు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవం

The Six Trs Candidates Were Unanimous :

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు దాఖ‌లు చేసిన‌ ఆరుగురు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, క‌డియం శ్రీహ‌రి, బండ ప్ర‌కాశ్‌, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి,  వెంక‌ట్రామిరెడ్డి ఎన్నిక ఏక‌గ్రీవ‌మైన‌ట్లు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి వెల్ల‌డించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు అభ్య‌ర్థుల‌కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను అంద‌జేశారు.

ఎమ్మెల్సీలుగా ఎన్నికయినట్టు గెలుపు ధ్రువీకరణ పత్రాలు తీసుకున్న తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంత్రి  ప్రశాంత్ రెడ్డితో కలిసి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాష్ , తక్కెళ్ల పల్లి రవీందర్ రావు , వెంకట్రామి రెడ్డి, కౌశిక్ రెడ్డిల ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ..

ఆరు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవమయ్యాయి. మాకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కి దన్యవాధాలు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది తెలంగాణ. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో  సీఎం కేసీఆర్ నేతృత్వంలో చిత్తశుద్దితో  పని చేస్తాం. టీఆర్ఎస్ ఒక నూతన ఓరవడికి శ్రీకారం చుట్టింది. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఎదుగుతున్న తెలంగాణను ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రబుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. మోడీ,బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు.. ఈ ఏడేళ్లలో దేశ జీడీపీ భారీగా తగ్గింది. కరోన సమయంలో మైనస్ కి జీడీపీ వెళ్ళింది. నరేంద్ర మోడీ గొప్ప పరిపాలన దక్షుడు అయితే దేశ జీడీపీ ఎలా తగ్గిందో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పాలి. ధాన్యం సేకరణ అనేది కేంద్రం పరిధి. కానీ కేంద్రం కొనటం లేదన్నారు.

Also Read : పోచంపల్లి నామినేష‌న్ దాఖలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular