Saturday, November 23, 2024
HomeTrending Newsగెజిట్ జారీలో కేంద్రం వక్రబుద్ధి

గెజిట్ జారీలో కేంద్రం వక్రబుద్ధి

కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. కేంద్ర జల శక్తి శాఖ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి అడ్డగోలు జీవో లు అక్కరకు రాని కేటాయింపులని, తెలంగాణ పై మరోసారి కేంద్ర ప్రభుత్వం వక్ర బుద్ధి బయట పడిందని తెరాస వర్గాలు మండిపడుతున్నాయి. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్టే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసిందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గజిట్ తో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారి గా మారనున్నదాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మధ్యాహ్నం గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అర్థరాత్రి ఇవ్వడంలో అంతర్యం ఏంటన్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పార్లమెంట్ సమావేశల్లో కేంద్రం తీరును ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చలు చేసి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కొద్దిసేపట్లో టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ తెరాసలో ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో చేరనున్నారు. తెలంగాణ భవన్ లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కెసిఆర్ కేంద్ర గెజిట్ పై స్పందించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్