Thursday, March 19, 2026
HomeTrending Newsదళితబంధుపై రేపు టిఆర్ఎస్ సమావేశం

దళితబంధుపై రేపు టిఆర్ఎస్ సమావేశం

తెలంగాణ భవన్ లో మంగళవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు.

దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్దతి, తీసుకోవాల్సిన చర్యల గురించి, పార్టీ చేయాల్సిన కృషి పై చర్చించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular