Sunday, January 19, 2025
HomeTrending NewsGHMCలో 95% వాక్సినేషన్

GHMCలో 95% వాక్సినేషన్

రాష్ట్రంలో మొదటి నుంచి చాలా శాస్త్రీయ పద్దతిలో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. పిల్లల ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యతని, మళ్ళీ కొత్త రకం స్ట్రైన్, ఇంతకన్నా బలమైన వైరస్ స్ట్రైన్ వస్తే తప్ప 3rd వేవ్ వచ్చే అవకాశం లేదని ప్రకటించింది. 8 నెలల తరువాత పాఠశాలల ప్రారంభం కావటంతో తల్లిదండ్రుల్లో భయాలు ఉన్నాయి. తక్కువగా విద్యార్థులు పాఠశాలలకు వచ్చారని, కోవిడ్ కట్టడికి మొదటినుంచి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని వైద్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

వైద్య శాఖ వివరాల ప్రకారం….

కొవిడ్ తో మరణాల శాతం కేవలం.0.5 శాతం ,రికవరీ రేట్ 98.5 శాతం ఉందని, 1-10 ఏళ్ళల్లోపు వారు కేవలం 3 శాతం మంది మాత్రము కోవిడ్ భారిన పడ్డారు. 20 ఏళ్ళల్లోపు వారు కేవలం 13 శాతం మందికి మాత్రమే కోవిడ్ సోకింది. కోవిడ్ బారిన పడిన వారిలో 73% శాతం మంది 20 నుంచి 60 ఏళ్ళల్లోపు వారు ఉన్నారు. పిల్లల్లో కోవిడ్ సోకినా 100 శాతం కొలుకుంటున్నారు. తెలంగాణలో  వైరస్ పూర్తిగా కంట్రోల్ లో ఉంది. గతంలో కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాల్లో కూడా వైరస్ కంట్రోల్  లోకి వచ్చింది. రాష్ట్రంలో 63 లక్షల మంది పాఠశాలల వయసు చిన్నారులు వున్నారు. సీరో సర్వే లో పెద్దల్లో 63 % మందికి, పిల్లల్లో 50% పైగా వైరస్ బారిన పడినట్టు తేలింది.

కేరళలో అత్యధికంగా కేసులు. దేశ వ్యాప్తంగా వస్తున్న కేసులలో 60 నించి 70 శాతం కేరళ నుంచే ఉన్నాయి. గత వారం రోజులుగా అక్కడ కేసులు పెరగడానికి పండుగలు కూడా కారణం. తెలంగాణలో బతుకమ్మ వంటి వేడుకలు జరిగినా కేసులు పెరగలేదు.

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు భయపడాల్సిన పని లేదు. కోవిడ్ వాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ghmc లో ఇంటింటికి వాక్సినేషన్ జరుగుతోంది. సీఎం అన్ని విభాగాల అధికారులతో చర్చించాకే పాఠశాలలను తెరిచేందుకు నిర్ణయించారు. ఇందుకు తగిన చర్యలు పూర్తి చేసాము. అన్ని పాఠశాలల్లో సానిటైజేషన్ చేసాము,థర్మల్ స్కానింగ్ ని అందుబాటులోకి తెచ్చాము. సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. 95% పాఠశాలల స్టాఫ్ కి వాక్సినేషన్ పూర్తి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మాత్రమే టీచర్ లు, స్టాఫ్ ని పాఠశాలలోకి అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాం. పాఠశాలలను మ్యాప్ చేసాము. అవసరం అయిన వారికి టెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. కోవిడ్ లక్షణాలు లేక ఇతర సీజనల్ వ్యాధుల లక్షణాలు ఉంటే పిల్లల్ని స్కూల్ కి పంపవద్దు. యూనిఫామ్ వేరుగా ఉంచి ఎప్పటికపుడు శుభ్రపరచాలి. స్కూల్ లో మాస్క్ , సానిటైజర్  వాడేలా చూడాలి.

3rd వేవ్ గురించి శాస్త్రి ఆధారాలు లేవు. ప్రభుత్వం 3rd వేవ్ కి పూర్తి గా సన్నదంగా ఉంది. కోవిడ్ కారణంగా విద్యా వ్యవస్థ దెబ్బ తిన్నది. పిల్లల్లో విద్య పై ఆసక్తి తగ్గుతోంది. ఫోన్, వంటి డిజిటల్ మాద్యమాలకు పిల్లలు బానిసలు అవుతున్నారు. పిల్లల మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకునే పాఠశాలల ఓపెన్ చేసాము. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్ కి పంపాలి. పాఠశాలల్లో 5 మంది కంటే ఎక్కువ మంది ఒకేసారి వైరస్ బారిన పడితే ఆ పాఠశలని క్లస్టర్ గా గుర్తించి పిల్లలు టీచర్స్ కి టెస్ట్ చేస్తాము. ఒకే క్లాస్ లో కేస్ లు వస్తే ఆయా క్లాస్ ని ఐసోలెట్ చేస్తాము.

ghmc లో 95% వాక్సినేషన్. 175 వాహనాల ద్వారా ghmc లో వాక్సినేషన్. 60% కాలనీలు 100% వ్యాక్సినేషన్ పూర్తి. మొబైల్ వాక్సినేషన్ ద్వారా 5.16 లక్షల మంది కి వాక్సినేషన్. ghmc తరువాత ఇతర కార్పొరేషన్ లు, గ్రామీణ ప్రాంతాలకు వాక్సినేషన్ డ్రైవ్ ని అందుబాటులోకి తెస్తాము.

RELATED ARTICLES

Most Popular

న్యూస్