Saturday, January 18, 2025
Homeసినిమాప్ర‌భాస్, గోపీచంద్ మ‌ల్టీస్టార‌ర్?

ప్ర‌భాస్, గోపీచంద్ మ‌ల్టీస్టార‌ర్?

Two Friends: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆదిపురుష్‌, స‌లార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, మారుతి డైరెక్ష‌న్ లో ఓ మూవీ ఇలా లిస్ట్ చాలా పెద్ద‌దిగా ఉంది. అయితే.. ప్ర‌భాస్ ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ త‌న స్నేహితుల సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డంలో ముందుంటారు. తాజాగా ప్ర‌భాస్ ఫ్రెండ్ గోపీచంద్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీని ప్ర‌మోట్ చేశారు. ప్ర‌భాస్, గోపీచంద్ ఇద్ద‌రు మంచి ఫ్రెండ్స్. వ‌ర్షం సినిమాలో న‌టించిన‌ప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది.

వీరిద్ద‌రి మ‌ధ్య ఆ స్నేహం అలాగే ఉంది. అయితే.. వ‌ర్షం సినిమాలో నువ్వా నేనా అన్న‌ట్టుగా పోటీప‌డి న‌టించారు,  ఆడియ‌న్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుని స‌క్సెస్ సాధించింది ఆ సినిమా . ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌క‌పోయినా గోపీచంద్ సినిమా రిలీజైన ప్ర‌తిసారీ ప్ర‌భాస్ ఏదో విధంగా ఆ సినిమాను ప్ర‌మోట్ చేస్తూ.. త‌న ఫ్రెండ్ కి స‌క్సెస్కోసం త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. ఈసారి కూడా అలాగే చేశాడు ప్ర‌భాస్.

అయితే.. వీరిద్ద‌రూ క‌లిసి ఇప్పుడు మ‌రో సినిమా చేస్తే బాగుంటుంద‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విష‌యం గురించి గోపీచంద్ ని అడిగితే… ఒక పాన్ ఇండియా సినిమా అందులోని మల్టీ స్టారర్ చెయ్యాల్సి వస్తే ప్రభాస్ తో చేస్తానని గోపీచంద్ తెలియ‌చేశారు. గోపీచంద్ ఎంత పొటెన్షియల్ ఉన్న నటుడో అందరికీ తెలుసు. ఇక ఈ కాంబోలో ప్ర‌భాస్ హీరోగా గోపీచంద్ విల‌న్ గా అయినా.. లేదా ప్ర‌భాస్, గోపీచంద్ ఇద్ద‌రూ హీరోలుగా క‌లిసి న‌టించినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ద‌మ్ములేప‌డం ఖాయం. మ‌రి.. ఈ క్రేజీ కాంబినేష‌న్ త్వ‌ర‌లో సెట్ అవుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్