Sunday, January 19, 2025
Homeసినిమాబన్నీ కూడా పులితో ఫైట్ చేయబోతున్నాడా..?

బన్నీ కూడా పులితో ఫైట్ చేయబోతున్నాడా..?

అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప‘. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించారు. గంధం చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమా సౌత్ లో కన్నా ఎక్కువుగా నార్త్ లో ఎక్కువగా రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. దీంతో ‘పుష్ప 2’ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా..? ఎప్పుడెప్పుడు అప్ డేట్స్ వస్తాయా అని బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 7 నుంచి ప్రారంభం కానుందని సమాచారం.

అయితే.. పుష్ప 2 గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. మేటర్ ఏంటంటే.. అటవీ నేపథ్యంలో సాగే కథ కాబట్టి.. ఈసారి క్రూర మృగాలతో పోరాటాలు పెట్టాలని సుకుమార్ ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగా పుష్ప రాజ్ కు పులితో ఫైట్ పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ లో పులితో  చేసే ఫైట్ హైలెట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 లో కూడా అలాంటి సన్నివేశం పెట్టబోతున్నారట. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాల్లో జంతువులతో పోరాడే సన్నివేశాలను సీజీలో క్రియేట్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా పులి లేకుండానే గ్రాఫిక్స్ తో రాజమౌళి ఆ సీన్ ని చూపించారు కానీ.. సుకుమార్ మాత్రం సీజీని నమ్ముకోకుండా.. రియాలిటీ కోసం నిజమైన పులితోనే ఫైట్ చేయించాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఫ్రెండ్లీ టైగర్స్ ని పుష్ప 2 కోసం రంగంలోకి దింపనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు అల్లు అర్జున్ సైతం పులితో ఫైట్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తమమో కాదో తెలియదు కానీ.. ఇదే జరిగితే సంచలనమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్