Wednesday, May 28, 2025
HomeTrending NewsMavo Threat: హైదరాబాద్లో నాలుగు రాష్ట్రాల డీజీపీల సమావేశం

Mavo Threat: హైదరాబాద్లో నాలుగు రాష్ట్రాల డీజీపీల సమావేశం

తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల డీజీపీల సమావేశం రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఈ రోజు జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో జాయింట్‌ ఆపరేషన్స్‌ నిర్వహించడం, అందుకు అవసరమైన ట్రైనింగ్‌ అంశాలపై 4 రాష్ట్రాల డీజీపీల మధ్య చర్చ సాగుతోంది. ఈ సమావేశంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల డీజీపీలు కూడా పాల్గొన్నారు. వీళ్లతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆయా రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ బ్యూరోల్లోని సీనియర్‌ అధికారులు, సీఆర్పీఎఫ్ ఐజీ చారుసిన్హా, గ్రేహౌండ్స్‌ ఏడీజీ సంజయ్‌జైన్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

దండకారణ్యం నుంచి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ వరకు విస్తరించిన అటవీ ప్రాంతాల్లో మళ్ళీ మావోల ప్రాబల్యం పెరుగుతోందని కేంద్ర నిఘా వర్ఘాలు ఇటీవలే హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో డిజిపిల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వర్షాకాలంలో మావోలు షెల్టర్ జోన్ లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ తరుణంలో నాలుగు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ఎదుర్కునే అంశాలపై పోలీస్ బాస్ లు చర్చిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్