Sunday, March 15, 2026
HomeTrending Newsకేంద్రం గొంతు నొక్కుతోంది - మంత్రి జగదీష్

కేంద్రం గొంతు నొక్కుతోంది – మంత్రి జగదీష్

విద్యుత్ సరఫరా అంశంలో తెలంగాణ గొంతు నొక్కేందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రప్రభుత్వ కుట్రలు పరాకాష్టకు చేరాయనడానికి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేస్తున్న సంస్థలపై కేంద్రం పెంచిన ఒత్తిడినే నిదర్శనంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. విద్యుత్ సరఫరాలో వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే మోడీ సర్కార్ ఈ కుట్రలకు తెరలేపిందని ఆయన విమర్శించారు. మంగళవారం ఉదయం సూర్యాపేటలో తనను కలిసిన మీడియాతో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే రానే రాదు అనుకున్న విద్యుత్ ను రాష్ట్రం ఏర్పడిన మూడేండ్లకే అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రాంగ తెలంగాణ రికార్డ్ సృష్టించిందన్నారు. యావత్ భారతదేశంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ,ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. దీన్ని చూసి తట్టుకోలేక బిజెపి పాలకులు కేంద్రప్రభుత్వం ద్వారా వాళ్ళ కుట్రలను అమలు పరుస్తున్నారని మండిపడ్డారు. ఖర్చుకు వెనకాడకుండా ఎంతటి తిప్పలు పడైనా సరే విద్యుత్ సరఫరా కొనసాగించాలన్న దృక్పథంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు పోతున్నారన్నారు.అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విద్యుత్ సంస్థల పై ఒత్తిడి పెంచి విద్యుత్ ను అమ్మనియకుండా బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. కొంతకాలం మౌఖిక ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ను అమ్మనియకుండా కేంద్రమంత్రి చేసిన ఒత్తిడిని ఖాతర్ చెయ్యక పోవడంతో రంగంలోకి దిగిన కేంద్రప్రభుత్వం ఏకంగా ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు. ప్రయివేటు ఉత్పత్తి దారులకు బాకి ఉంటే వాళ్ళతో ఫిర్యాదు చేపించు సరఫరా ను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీచేస్తాం అంటూ దాదాగిరికి దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.

వాస్తవానికి విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కేంద్రానికి కానీ యన్.ఎల్ డి.సి,యస్.ఎల్ డి సి లకు నిమిత్త మాత్రం సంబంధం ఉండదని మంత్రి జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత లోడ్ పడుతుంది… ఎక్కడ ఎంత అవసరం ఉంటుంది..ఏ ప్రాంతంలో ఎంత విద్యుత్ వినియోగం ఉంటుంది…ఎక్కడి నుండి ఎక్కడికి ట్రాన్స్ ఫార్మ్ చెయ్యాలి అన్నదే లోడ్ డిస్పాచ్ సెంటర్ ల విధి అని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం అనేది ఉత్పత్తి దారులకు,ఆయా డిస్కం,ట్రాన్స్కో,జెన్కో ల మధ్య ఉంటుందన్నారు.ఇందులో కేంద్రప్రభుత్వం, ఎల్ డి సి ల పాత్ర ఉండదన్నారు. ఉత్పత్తి దారులకు కొనుగోలు దారులు బాకి పడితే సరఫరా నిలిపే హక్కు ఆ ఉత్పత్తి దారులకు మాత్రమే ఉంటుందన్నారు. కాదు అనుకుంటే ఈ ఆర్ సి కి వెళ్లే వేసులు బాటు ఉంటుందన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వ్యవసాయానికి కనీసం ఆరు గంటల కుడా విద్యుత్ సరఫరా చెయ్యలేక చేతులెత్తిసిన అక్కడి ప్రభుత్వం పరిశ్రమలకు అధికారికంగా రెండు రోజులు అనధికారికంగా మరో రోజు కోతలు విదిస్తుందన్నారు. మోడీ సొంత రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉంటే బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడ కుడా విద్యుత్ సరఫరా మెరుగు పడలేదని ఆయా రాష్ట్రాల ప్రజలు తెలంగాణను నమూనాగా తీసుకుని నిలదిస్తారనే భయంతో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

Also Read : దేశ విద్యుత్ రంగంలో తెలంగాణకు రెండో స్థానం  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular