రోడ్లపై ర్యాలీలు, రోడ్ షో లు నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో విపక్షాలకే కాదని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ జీవో వెనుక ఎలాంటి దురుద్దేశాలూ లేవని, విపక్షాలే అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు మాత్రమే సభలు పెట్టుకోకూడదని ఎక్కడా చెప్పలేదని, జీవో నిబంధనలు అందరికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీలు సభలు పెట్టుకోవద్దని తామెక్కడా చెప్పలేదని సజ్జల అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్రౌండ్ లలో నిర్వహించుకోవచ్చని సూచించారు. అయినా రోడ్లు ఉన్నది ప్రయాణం కోసమని, బహిరంగసభల కోసం కాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సంబధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.
Also Read : రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం