Saturday, January 18, 2025
Homeసినిమా‘కేజీఎఫ్’ హీరోతో బోయపాటి సినిమా?

‘కేజీఎఫ్’ హీరోతో బోయపాటి సినిమా?

నందమూరి నటసింహం బాలకృష్ణతో.. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ‘అఖండ’ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను.. అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉంది, దీనికోసం కథ కూడా రెడీ చేశారు. అయితే.. ‘పుష్ప’ పార్ట్ 1 తర్వాత ‘ఐకాన్’ ఆ తర్వాత ‘పుష్ప-2’ చేయాలి. ఇదంతా జరగడానికి టైమ్ పడుతుంది కాబట్టి వేరే హీరోతో సినిమా చేయాలనుకుంటున్నారు బోయపాటి.

తమిళ హీరో సూర్యతో బోయపాటి సినిమా పిక్స్ అయ్యిందని ఇటీవల వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీని దిల్ రాజు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపించింది. అయితే.. బోయపాటి దగ్గర మాంచి మాస్ స్టోరీ ఉందట. అది ‘కేజీఎఫ్’ హీరో యష్ కి కరెక్ట్ గా సరిపోతుందని.. ఆయనతో చేస్తే ఎలా ఉంటుదని ఆలోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో బోయపాటి తదుపరి చిత్రం సూర్యతోనా..? యష్ తోనా.? అనేది ఆసక్తిగా మారింది. ‘అఖండ’ తర్వాతే బోయపాటి నెక్ట్స్ మూవీ పై క్లారిటీ వస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్