Thursday, March 12, 2026
HomeTrending NewsYanamala: మేనిఫెస్టోలో యువత, మహిళా, రైతులకు ప్రాధాన్యం

Yanamala: మేనిఫెస్టోలో యువత, మహిళా, రైతులకు ప్రాధాన్యం

తాము అధికారంలోకి వస్తే సంక్షేమంలో ఎలాంటి కోత ఉండబోదని, అర్హులందరికీ సంక్షేమం అందిస్తామని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. రాజమండ్రిలో  ఈనెల 27,28 తేదీల్లో జరగబోయే మహానాడులో మొత్తం 19 తీర్మానాలు ఉంటాయని వైఎస్సార్సీపీ దోపిడీని వివరిస్తామని, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చర్స్తిస్తామని వెల్లడించారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎలా ఉంటుందనే దానిపై మహానాడులో ఓ అవగాహన ఇస్తామని, యువత, మహిళల, రైతులకు పెద్ద పీట వేసేలా మేనిఫెస్టో ఉండబోతోందని చెప్పారు.

రెండు వేల రూపాయల నోట్ల రద్దుతో బ్లాక్ మనీని అరికట్టవచ్చని యనమల అభిప్రాయపడ్డారు. ఈ రద్దుతో సామాన్యుడికి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు పెరుగుతాయని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular