Saturday, January 18, 2025
Homeసినిమాఆ వార్తలో నిజం లేదు : తరుణ్

ఆ వార్తలో నిజం లేదు : తరుణ్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ‘SSMB28’ అనే భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయం మీద తరుణ్ క్లారిటీ ఇచ్చారు.

తనను ఈ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని, ఈ వార్త నిజం కాదని తరుణ్‌ తెలియచేశారు. తనకు సంబంధించిన ఎలాంటి వార్త ఉన్నా తన అభిమానులతో పంచుకుంటానని అన్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో సందడి చేసిన తరుణ్ కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్