Sunday, March 8, 2026
Homeసినిమామహేష్ మూవీలో అర్జున్ నిజమేనా?

మహేష్ మూవీలో అర్జున్ నిజమేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు – ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేష్ సరసన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తుంది. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాల నేపధ్యంలో రూపొందుతోన్న సినిమా ఇది. దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ తో పాటు మహేష్, కీర్తి సురేష్ ల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది అఫిషియల్ గా ప్రకటించలేదు కానీ.. ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. అరవింద స్వామి, అనిల్ కపూర్, ఉపేంద్ర, సుదీప్.. ఇలా చాలా మందిని పరిశీలించారని తెలిసింది. విలన్ పాత్రకు ఎవర్ని ఎంపిక చేశారో అనౌన్స్ చేయలేదు కానీ.. తాజాగా ఓ కీలక పాత్ర కోసం యాక్షన్ కింగ్ అర్జున్ ని ఫైనల్ చేశారని… ఇందులో అర్జున్ పోలీస్ గా కనిపించనున్నారని సమాచారం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’….ఇలా వరుస విజయాలు సాధించిన ప్రిన్స్ మహేష్‌ కు ‘సర్కారు వారి పాట’ మరో బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular