Sunday, January 19, 2025
HomeసినిమాLegends: రజనీకాంత్ లపై విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్

Legends: రజనీకాంత్ లపై విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ కు జంటగా సమంత నటించింది. పాటలు, టీజర్, ట్రైలర్ కు అనూహ్య స్పందన రావడంతో సినిమాపై  కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 1న ‘ఖుషి’ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖచ్చితంగా ఇది యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని.. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

ప్రమోషన్స్ లో విజయ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. కోయంబత్తూరుకూడా వెళ్లి ప్రమోట్ చేస్తున్నాడు విజయ్. అయితే.. చిరంజీవి, రజినీకాంత్ లపై విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “చిరంజీవి, రజినీకాంత్ ఐకానిక్ స్టార్స్. వాళ్లిద్దరూ ఎంతో మంది నటీనటులకు ఆదర్శం. వాళ్లకు ఫ్లాప్ వచ్చినంత మాత్రాన అంతా అయిపోయింది అనుకోవడం.. విమర్శలు చేయడం కరెక్ట్ కాద”న్నాడు.

రజినీ సార్.. చాలా ప్లాప్స్ ని చూశారు. ప్రస్తుతం జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. ఈ సినిమా 500 కోట్లు కొలగొట్టింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా వలే మరో బ్లాక్ బస్టర్ తో కమ్ బ్యాక్ ఇవ్వగలరు అని చెప్పారు. ఈ హీరోలను ప్లాప్స్ తో జడ్జ్ చేయడం.. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదన్నాడు. చిరు, రజినీ గురించి విజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్