Wednesday, January 29, 2025
HomeTrending NewsYSRTP: కెసిఆర్ కు ఎందుకు భయం..? - వైయస్ షర్మిల

YSRTP: కెసిఆర్ కు ఎందుకు భయం..? – వైయస్ షర్మిల

తెలంగాణ రాష్ట్ర విద్యార్ధి, నిరుద్యోగ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ రోజు (ఏప్రిల్ 17న) T-SAVE ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించతలపెట్టిన ఒక్క రోజు నిరాహార దీక్షకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిని YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలు, నీతిమాలిన రాజకీయాలకు ఇది పరాకాష్ట అన్నారు.
“ఉద్యమాల పునాదిపై పురుడు పోసుకున్న పార్టీ అని సిగ్గులేకుండా గొప్పలు చెప్పుకునే ఓ కేసీఆర్, పనికిమాలిన కారణాలు చూపి దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం సమంజసమా? అన్నారు. ఇదేనా నీ ఉద్యమ స్ఫూర్తి? తెలంగాణకు పట్టిన నీ నీచపాలన తుప్పును వదిలించడానికి, నీ తప్పులను కడిగేయటానికి పూనుకున్న ఈ పోరాటాన్ని చూసి వెన్నులో వణుకా? కడుపులో మంటా? కంటికి కునుకులేదా? యువత అసంతృప్తి జ్వాలలు రగిలి నిన్ను, నీ సర్కారును మాడ్చి మసి చేస్తాయని హెచ్చరించారు.

భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 125 విగ్రహాన్ని ఆవిష్కరించి రెండు రోజులు కూడా కాలేదు. అంతలోనే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గాలికొదిలేశారని విమర్శించారు. ప్రశ్నించే హక్కును, భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారు. పోరాడే గొంతులను నొక్కేస్తున్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నామని పైకి చెబుతూనే.. సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్