Saturday, January 18, 2025
HomeసినిమాGuntur Kaaram First Single: 'గుంటూరు కారం' ప్లాన్ మారిందా..?

Guntur Kaaram First Single: ‘గుంటూరు కారం’ ప్లాన్ మారిందా..?

మహేష్‌ బాబు,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇందులో మహేష్ కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని ఓ ఫైవ్ స్టార్ హాటల్ లో జరుగుతుంది.

అయితే.. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ పుట్టినరోజున ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలి అనుకున్నారు. థమన్ ఈ మూవీ టైటిల్ సాంగ్ రెడీ చేశాడు. విదేశాల్లో ఉన్న మహేష్ కు పంపించారు. అయితే.. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆ పాటను రిలీజ్ చేయలేదు. అప్పటి నుంచి గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా..? అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వినాయక చవితికి ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ప్లాన్ మారిందని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ముందుగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు టైటిల్ సాంగ్ కాకుండా మెలోడీ సాంగ్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఆతర్వాతే టైటిల్ సాంగ్ చేయలని ఫిక్స్ అయ్యారట. మరో విషయం ఏంటంటే.. వినాయక చవితి నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు రిలీజ్ చేయడం లేదట. దసరాకి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. అయితే.. దీని పై క్లారిటీ రావాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్