Sunday, January 19, 2025
Homeసినిమా'యాత్ర' సక్సెస్.. 'యాత్ర 2' తో రిపీట్ అయ్యేనా..?

‘యాత్ర’ సక్సెస్.. ‘యాత్ర 2’ తో రిపీట్ అయ్యేనా..?

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. వై.ఎస్ పాత్రలో మమ్ముట్టి నటించగా, మహి వి రాఘవ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2019 ఫిబ్రవరి 8న ‘యాత్ర’ చిత్రం రిలీజైంది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని యాత్ర చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. ఇప్పుడు యాత్ర చిత్రానికి సీక్వెల్ గా ‘యాత్ర 2’ రూపొందుతోంది. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఆడియన్స్ లో  ఆసక్తి ఏర్పడింది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్ ప్రజా నాయకుడుగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిణామాలను ఈ మూవీలో చూపించనున్నారని తెలిసింది.

ఇక వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ఆమధ్య రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో వై.ఎస్ పాత్రలో మమ్ముట్టి, వై.ఎస్. జగన్ పాత్రలో జీవా ఇన్ టెన్స్ లుక్స్ తో కనిపిస్తున్నారు. నేనెవరో ఈ ప్రపంచానికి తెలియపోవచ్చు కానీ.. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కొడుకుని అనే ఎమోషనల్ డైలాగ్ ను కూడా పోస్టర్ లో గమనించవచ్చు. ఈ పోస్టర్ కు కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

యాత్ర చిత్రాన్ని 2019లో ఫిబ్రవరి 8న రిలీజ్ చేశారు. విజయం సాధించింది. ఇప్పుడు అదే డేట్ కి అంటే.. 2024లో ఫిబ్రవరి 8న యాత్ర 2 చిత్రాన్ని విడుదల చేయాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మరి.. యాత్ర సక్సెస్ ను యాత్ర 2 రిపీట్ చేస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్