Sunday, January 19, 2025
Homeసినిమామహేష్‌, రాజమౌళి మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు.?

మహేష్‌, రాజమౌళి మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు.?

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రానుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కరోనా టైమ్ లో రాజమౌళి నెక్ట్స్ మూవీ మహేష్‌ బాబుతో అని ప్రకటించారు కానీ.. అపిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి తాజా వార్త ఏంటంటే.. మహేష్ కి జక్కన్న ఫుల్ స్టోరీని నెరేట్ చేయడం జరిగిందని తెలిసింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందట.

ఈ భారీ, క్రేజీ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. మరి.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందంటే.. మార్చిలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేందుకు జక్కన్న భారీగా ప్లాన్ చేస్తున్నారట. ఇంకా చెప్పాలంటే.. హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేయనున్నారని సమాచారం. అయితే.. మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం చిత్రం చేస్తున్నారు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు పక్కా ప్లాన్ తో టీమ్ వర్క్ చేస్తున్నారు.

అయితే.. మార్చి నుంచి రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకోవడంతో.. మార్చికి రెండు నెలల ముందు అంటే.. జనవరికి రెడీగా ఉండాలని మహేష్ బాబుకు జక్కన్న చెప్పారట. దీని ప్రకారం జనవరి నుంచి ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాపు స్టార్ట్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా తీయని విధంగా అత్యథిక బడ్జెట్ తో.. భారీ తారాగణంతో ఈ మూవీ ఉంటుందట. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి.. ఈ సినిమాతో మహేష్‌, రాజమౌళి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్