Wednesday, March 18, 2026
Homeసినిమా‘ఖిలాడి’ మూడ‌వ పాట ‘అట్టా సూడ‌కే’ విడుద‌ల‌

‘ఖిలాడి’ మూడ‌వ పాట ‘అట్టా సూడ‌కే’ విడుద‌ల‌

Khiladi promotions gear up: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేష‌న్ లో రాబోతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఖిలాడీ’ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రొడ‌క్ష‌న్ చివ‌రిద‌శ‌లో ఉంది. ఈ మూవీ మ్యూజిక్ ప్ర‌మోష‌న్స్‌ లో భాగంగా విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మూడవ‌పాట‌ ‘అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే.. ఒంట్లో వేడికే పిచ్చెక్కుతాంది నాడికే`ను విడుద‌ల‌ చేశారు.

దేవిశ్రీ ప్రసాద్ ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్ కు ట్యూన్ కంపోజ్ చేయ‌డంతో పాటు సింగర్ సమీరా భరద్వాజ్ తో కలిసి స్వయంగా ఆలపించారు. దీనికి రచయిత శ్రీమణి మాస్ ఆడియన్స్ కి నచ్చేలా సాహిత్యం రాశారు. ‘అట్టా సూడకే’ పాటలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ – మీనాక్షి చౌదరీ ఎనర్జిటిక్ మాస్ స్టెప్పుల‌తో అదరగొట్టారు. నిర్మాత‌లు ముందుగా ప్రకటించినట్టుగానే ‘ఖిలాడీ’ ఫిబ్రవరి 11న థియేటర్లోకి రానుంది.

బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ‘ప్లే స్మార్ట్’ అనే ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదల కాగా.. విశేషమైన స్పందన లభించింది. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular