Sunday, September 8, 2024
HomeసినిమాVirupaksha: ప్రేక్షకుల ఛాలెంజ్ కు సమధానం ఈ విజయం

Virupaksha: ప్రేక్షకుల ఛాలెంజ్ కు సమధానం ఈ విజయం

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మిస్టిక‌ల్‌ థ్రిల్లర్ ‘విరూపాక్ష’.  సంయుక్తా మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌ పై ఈ చిత్రం రూపొందింది. బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది.

స‌క్సెస్ మీట్‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ ‘విరూపాక్ష’ సినిమా స‌క్సెస్ నాదో, మా టీమ్‌దో కాదు… ప్రేక్షకులది. గ‌త ఏడాది కొన్ని సినిమాల‌కు జ‌నాలు రాలేదు. ఎందుకంటే వాళ్లు మాకు ఛాలెంజ్ విసిరారు. మేం థియేట‌ర్స్‌కు రావాలంటే అలాంటి సినిమాలు మీరు చేయండ‌ని చెప్పారు. ఆ ఛాలెంజ్‌కి ఆన్స‌రే విరూపాక్ష‌. ద‌య‌చేసి అంద‌రూ థియేట‌ర్‌కి వ‌చ్చి సినిమా చూడండని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సినిమా మ‌న ఫిల్మ్ ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ ఇది. సినిమాలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌. ప‌ప్పుగారు డ‌బ్బింగ్ విష‌యంలో ఎంత‌గానో హెల్ప్ చేశారు. నాకు యాక్సిడెంట్ జ‌రిగిన‌ప్పుడు సాయంగా నిల‌బ‌డిన డాక్ట‌ర్స్‌కి థాంక్స్‌. వారు నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చారు. మా ముగ్గురు మావ‌య్య‌ల‌కు థాంక్స్‌. మారుతి గారికి, గోపన్న‌గారికి థాంక్స్‌. మీడియా కూడా ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది. పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమాను తీసుకెళ్ల‌టానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్