Sunday, January 19, 2025
Homeసినిమానేను వాళ్లకి ఎప్పటికీ రుణపడి ఉంటాను : సంతోష్ శోభన్

నేను వాళ్లకి ఎప్పటికీ రుణపడి ఉంటాను : సంతోష్ శోభన్

This Is An Out And Out Entertainer Hero Santosh Sobhan On Manchi Rojulochaie :

సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతి డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమా విడుదలవుతోంది. కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..

సరిగ్గా ‘ఏక్ మినీ కథ’ రిలీజ్ కి వారం ముందు మా ప్రొడ్యూసర్స్ మారుతి గారు కథ చెప్తారు వెళ్లి వినమన్నారు. మారుతి గారితో సినిమా అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. సో వెళ్లి కలవగానే ఫస్ట్ హాఫ్ చెప్పారు,  చాలా బాగుంది… హిలేరియస్ గా ఉందని చెప్పేసి వచ్చాను. ‘ఏక్ మినీ కథ’ రిలీజ్ తర్వాత సెకండాఫ్ చెప్పారు. ఇంకా ఎగ్జైట్ అయ్యాను. ఆ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ సినిమా స్టార్ట్ అయింది. అలా ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది. సినిమాలో నేను కంప్లీట్ గా మారుతి గారి హీరోలానే కనిపిస్తాను. ఆయన హీరోలు చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ మంచి టైమింగ్ తో కామెడీ పండిస్తారు. నేనూ అదే చేశాను. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన రాసింది రాసినట్టు డెలివరీ చేస్తే చాలు సూపర్ గా వర్కౌట్ అయిపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే మారుతి గారి లాంటి ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తో సినిమా చేయడం నా అదృష్టం.

యూవీ క్రియేషన్స్ అంటే నా హోమ్ బేనర్. ఎప్పుడు తీరికగా ఉన్నా యూవీ ఆఫీస్ కొచ్చి కూర్చుంటాను. ఇక్కడ నాకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది. వంశీ అన్న, వికీ అన్న అందరూ నన్ను ఓ బ్రదర్ లా ట్రీట్ చేస్తుంటారు. వాళ్ళతో నా బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ నాతో సినిమాలు చేస్తున్నందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమాలో మెహ్రీన్, నాకు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. తనతో వర్క్ చేయడం హ్యాపీ గా ఉంది. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.

సినిమాలో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రతీ సీన్ కి బాగా నవ్వుకుంటారు. మారుతి గారి నుండి ఎక్స్ పెక్ట్ చేసే కామెడీ ఈ సినిమాలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. సినిమా ఫినిష్ అయ్యాక కూడా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారు. దానికి మాత్రం నాదీ గ్యారెంటీ. కొన్ని సినిమాలకు అన్నీ కుదురుతాయన్నట్టు. ఈ సినిమాకు అన్నీ బాగా కుదిరాయి. మారుతి గారు , యూవీ క్రియేషన్స్ , అనూప్ రుబెన్స్ మ్యూజిక్ అన్ని బాగా కుదిరాయి. అందుకే సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సినిమాలో ఎంత ఫన్ ఉందో మేకింగ్ లో కూడా అంతే ఫన్ ఉంది. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. మేకింగ్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

నేను ఇంకా పూర్తిగా సినిమా చూడలేదు. రేపు ప్రీమియర్స్ లో అందరితో పాటు ఎక్స్ పీరియన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా రేపు అందరూ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా మాట్లాడాలని స్పీచ్ ప్రిపేర్ అయ్యాను. కానీ ఉన్నపళంగా ఏదో మాట్లాడేసాను. ఎదురుగా గోపీచంద్ గారు , మారుతీ గారు, మా వంశీ అన్న, విక్కీ అన్న ఇలా అందరూ ఉండే సరికి చాలా ఎమోషనల్ అయ్యాను. పదేళ్ళ నుండి పడిన స్ట్రగుల్స్ అన్నీ ఆ స్టేజి మీద గుర్తుచేసుకొని ఎమోషనల్ గా మాట్లాడను.

‘ఏక్ మినీ కథ’ సినిమా థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారనుకున్నాను కానీ.. కొన్ని పరిస్థితుల వల్ల OTT లో రిలీజైంది కానీ.. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది…కానీ థియేటర్స్ ఇంపాక్ట్ వేరు. నేను యాక్టర్ అవ్వాలనుకున్నది అక్కడి నుండే కాబట్టి థియేటర్ రిలీజ్ అంటే ఎక్కువ ఎగ్జైట్ అవుతుంటాను. ఈ సినిమా ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి ఫీలింగ్ వెరీ హ్యాపీ” అన్నారు.

Must Read :అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేయాలని ఉంది : మెహ్రీన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్