Monday, January 20, 2025
Homeతెలంగాణమంత్రి అజయ్ ఆకస్మిక తనిఖీ

మంత్రి అజయ్ ఆకస్మిక తనిఖీ

ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను ఈ రోజు ఉదయాన్నే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ V.P గౌతమ్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతితో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రి సైకిల్ పై పర్యటించారు.

నగరంలోని పలు వీధులు తిరిగి స్థానిక నివాసాల ప్రజలతో మాట్లాడారు. మిషన్ భగీరథ, రోడ్లు, వీధి దీపాలు, పైప్ లైన్ పనులు, రోడ్డు విస్తరణ పనులు, కాల్వలు తదితర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం లకారం ట్యాంక్ బండ్ నందు మొక్కలు నాటారు. కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అన్ని పనుల సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆ తర్వాత పేద ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యధునాతన CT స్కాన్ యంత్రాన్ని ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్