Wednesday, March 18, 2026
HomeTrending NewsSteel Bridge: హైదరాబాదు ప్రజా రవాణాలో మరో మైలురాయి

Steel Bridge: హైదరాబాదు ప్రజా రవాణాలో మరో మైలురాయి

హైదరాబాదులో ప్రజా రవాణాలో మరో మైలురాయి చేరనున్నది. ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరా పార్క్ వరకు సుమారు 450 కోట్ల రూపాయలతో నిర్మించిన పొడవైన స్టీల్ బ్రిడ్జి ఈనెల 19వ తేదీన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని జిహెచ్ఎంసి స్టాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎస్ఆర్డీపీలో భాగంగా చేపట్టింది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి హోంశాఖ మంత్రివర్యులుగా పనిచేసిన కీర్తిశేషులు నాయిని నరసింహారెడ్డి పేరును ఈ స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కి పెట్టనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు ఈ స్టీల్ బ్రిడ్జ్ కి నాయిని పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఆదేశాలను జారీ చేయనున్నది. సుదీర్ఘ కాలం పాటు ముషీరాబాద్ కేంద్రంగా రాజకీయాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి అనేక సేవలందించిన నాయిని నర్సింహారెడ్డి, అక్కడే ఉన్న విఎస్ టి ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో నాయిని గారి సేవలను దృష్టిలో ఉంచుకొని నాయిని నరసింహారెడ్డి పేరును ఈ స్టీల్ బ్రిడ్జికి పెట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular