Saturday, September 21, 2024
Homeసినిమాఈ ఫ్రైడే ఈ ఇద్దరు హీరోలకీ కీలకమే!

ఈ ఫ్రైడే ఈ ఇద్దరు హీరోలకీ కీలకమే!

ఈ శుక్రవారం దాదాపు ఓ అరడజను సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. బ్యానర్ .. బడ్జెట్ .. కాస్టింగ్ పరంగా చూసుకుంటే, ముందుగా ‘రంగబలి’ .. ఆ తరువాత స్థానంలో ‘భాగ్ సాలే’ కనిపిస్తున్నాయి. నాగశౌర్య హీరోగా ‘రంగబలి’ సినిమా రూపొందింది. పవన్ బాసంశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో యుక్తి తరేజా హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకి ఒక రేంజ్ లోనే ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు.

ఇక కీరవాణి చిన్నబ్బాయ్ ‘శ్రీసింహ’ హీరోగా చేసిన ‘భాగ్ సాలే’ ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు కూడా కొత్త కుర్రాడే. కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, కథానాయికగా నేహా సోలంకి  నటించింది. ఈ సినిమా టీమ్ యూత్ లో ఆసక్తిని రేకెత్తించే పనిలో ఉంది. నిజామ్ కాలానికి చెందిన ఒక చిత్రమైన ఉంగరాన్ని దక్కించుకోవడం ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. ఆ ఉంగరం వెనుక దాగిన కథ ఏమిటనేది ఆసక్తికరంగా మారనుంది.

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే కొంతకాలంగా నాగశౌర్యకి హిట్ లేదు. ఆ హిట్ ను దొరకబుచ్చుకోవడానికి ఆయన నానా తంటాలు పడుతున్నాడు. తన గ్రాఫ్ ను తిరిగి పైకి లేపడానికిగాను ఈ సినిమా హిట్ ఆయనకి చాలా అవసరం. అందువలన తనవంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. ఇక శ్రీ సింహ కూడా ఇంతకుముందు ఒక మూడు సినిమాల వరకూ చేశాడుగానీ, అవి ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అందువలన ఈ సినిమా హిట్ పైనే ఆయన ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఇద్దరి హీరోలకు ఈ శుక్రవారం కీలకంగానే నిలవనుందనేది మాత్రం వాస్తవం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్