Friday, March 20, 2026
HomeTrending Newswar of words: కమలం.. విలవిలలాడుతోంది - కేటిఆర్

war of words: కమలం.. విలవిలలాడుతోంది – కేటిఆర్

బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ట్విట్టర్లో స్పందించారు.

త్వరలో అధికారంలోకి కాదు..
బీజేపీ అంధకారంలోకే…

త్వరలో
రాష్ట్రంలో బీజేపీ ఖాళీ…
ఢిల్లీలో.. ప్రధాని కుర్చీ ఖాళీ..

2024లో..
వైఫల్యాల మోదీకి
గుజరాత్ ఘర్ వాపసీ తప్పదు

మరోసారి
మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే..
దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టే
అనే బలమైన భావనలో ప్రజలు

కారు స్టీరింగ్ కాదు…

బీజేపీ స్టీరింగే ఆదానీ చేతికి చిక్కింది.
కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో
కమలం.. విలవిలలాడుతోంది.

హిండెన్ బర్గ్ రిపోర్ట్ తో
బీజేపీ ఫుల్ పిక్చర్ ను
దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారు.
ఇంకా ఏ ట్రయిలర్ అవసరం లేదు

తెలంగాణలో
గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు నడవవు
ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవు

ఆదానీపై జేపీసీ వేయని బీజేపీకి
సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కు ఉందా..

ముక్కునేలకు రాసినా…
మోకాళ్ల యాత్ర చేసినా…
మోసాల మోదీని తెలంగాణ నమ్మదు.
బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదు

కరప్షన్ కు కెప్టెన్… మోదీ
క్యాప్షన్… బీజేపీ

ఎంఐఎం భుజంపై
తుప్పుపట్టిన బీజేపీ తుపాకీపెట్టి
ఎంతకాలం కాలుస్తారు.

తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ

పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్

కేంద్ర నిధులు దుర్వినియోగమా ?

బారాణా తీసుకుని చారాణా కూడా
ఇవ్వని బీజేపికి మిగిలేది బూడిదే

అదానీ విషయంలో JPC కాదు కదా కనీసం SIT కూడా వేయని వారు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కేటిఆర్ ఘాటుగా విమర్శించారు. గుజరాత్ లో మోడీ హయాం లో మీరు హోం మంత్రి గా ఉన్నప్పుడు పేపర్ లీకుల లో గుజరాత్ No – 1 గా ఉన్నమాట నిజం కాదా?

గత ఎనిమిది ఏళ్లలో గుజరాత్ లో 13 సార్లు పేపర్ లీక్స్ కాలేదా ? ఈ దేశంలో వ్యాపం లాంటి అతి జుగుప్త్సా కరమైన స్కాం చేసింది మీ BJP పార్టీ ప్రభుత్వం కాదా? అటువంటి మీరు నిస్సిగ్గుగా సుద్దులు మాట్లాడం మీకే చెల్లిందన్నారు.

PM cares లో ఎంత జమైంది – ఏ విదంగా ఖర్చు అయ్యిందో చెప్పని వారు …CAG ఆడిట్ PM cares కు వర్తించదు అని నిస్సిగ్గుగా సుప్రీం కోర్టు లో అఫిడవిట్ వేసిన వారు…CAG మాత్రమే కాక అన్ని రకాల బ్యాంక్స్ ఆడిట్ ల తో కట్టిన ప్రాజెక్ట్ ల పై మాట్లాడం.. అవివేకం కాక మరి ఏమిటి? ఎనిమిది ఏళ్లుగా కృష్ణ నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా ఇక్కడికి వచ్చి ఎవరో మీ గులాములు రాసిచ్చిన స్క్రిప్టును వల్లెవేస్తె నమ్మేదెవరని కేటిఆర్ విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular