Saturday, September 21, 2024
HomeTrending NewsTSEamcet: ఎంసెట్‌ కౌన్సిలింగ్ లో జాగ్రత్తలు

TSEamcet: ఎంసెట్‌ కౌన్సిలింగ్ లో జాగ్రత్తలు

తెలంగాణ ఎంసెట్‌లో మీకు సీటు వచ్చిందా.. అయితే మీరు ట్యూషన్‌ ఫీజు చెల్లించకపోతే.. వచ్చిన సీటు కోల్పోయినట్టే. ఒకవేళ సీటు అవసరం లేదనుకొంటే ఫీజు కట్టకపోయినా పర్వాలేదు. దాంతో ఆ సీటును రద్దు చేసి, రెండో విడత కౌన్సెలింగ్‌లో ఇతరులకు కేటాయిస్తారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ మొదటి విడత సీట్లను ఆదివారం కేటాయించిన విషయం తెలిసిందే. సీటు పొందిన వారు ట్యూషన్‌ ఫీజును ఈ నెల 22 లోపు చెల్లించే అవకాశం కల్పించారు. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోటా విద్యార్థుల్లో జీరో ఫీజుగా ఉన్నవారు రూ.5వేలు కట్టాల్సి ఉండగా, రీయింబర్స్‌మెంట్‌ ఉండి, కాలేజీ ఫీజు అంతకంటే అధికంగా ఉన్నవారు మాత్రం ఎంత ఫీజుంటే అంత మొత్తాన్ని ట్యూషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

మొదటివిడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన వారు, మంచి కాలేజీలో లేదా నచ్చిన కోర్సులో సీటు కోసం రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. అయితే ఈ సమయంలోనే విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లోని సీటు ఇష్టమైతే.. ఫీజు చెల్లించి, రెండో విడతలో పాల్గొనవచ్చని అంటున్నారు. మొదటి విడతలో సీటు కన్ఫర్మ్‌చేసిన తర్వాత రెండో విడత సీటు సంతృప్తికరం అయితే ఆటోమెటిక్‌గా మొదటి విడత సీటు రద్దవుతుందని తెలిపారు. కావున విద్యార్థులు తమ అభిరుచిని బట్టి నడుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్