Saturday, March 14, 2026
HomeసినిమాRam Charan: 'గేమ్ ఛేంజర్' టార్గెట్ ?

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ టార్గెట్ ?

రామ్ చరణ్‌,  డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా..  శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ టర్నడ్ యాక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నారు.  ఎప్పటి నుంచో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్న శంకర్ ఆశ ఇప్పటికి నెరవేరింది. గతంలో చిరంజీవి చేయాలనుకున్నా అది కుదరలేదు, ఇప్పుడు తనయుడు చరణ్ తో చేస్తుండడం విశేషం.

రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. దీంతో చరణ్ కు బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ‘గేమ్ ఛేంజర్’ 1000 కోట్ల మార్క్ చేరుకోవాలన్న లక్ష్యాన్ని మేకర్స్ పెట్టుకున్నారట. ఈ మేరకు దిల్ రాజు  ప్రమోషన్స్ పై దృష్టి పెట్ట్టారు.  దీనికి గాను  పక్కా ప్లాన్ రెడీ చేశారని టాక్ వినిపిస్తుంది.

సామాజిక అంశాలను ప్రస్తావించే శంకర్ ఇటీవల కాలంలో సక్సెస్ లేక వెనకబడ్డారు. ఇప్పుడు ఈ సినిమాతో తన మార్క్ చూపించి మళ్లీ ఫామ్ లోకి రావాలనుకుంటున్నారట. ఇటీవల ఈ మూవీ క్లైమాక్స్ కంప్లీట్ చేశారు. ఇంకా కొంత టాకీ బ్యాలెన్స్ ఉంది. త్వరలో దీన్ని కంప్లీట్ చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు. మరి.. చరణ్‌, శంకర్ కాంబో గేమ్ ఛేంజర్ 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందా..? లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular