Saturday, January 18, 2025
Homeసినిమాతెరపైకి ముగ్గురు నాగేశ్వరరావులు తయారు! 

తెరపైకి ముగ్గురు నాగేశ్వరరావులు తయారు! 

Three Raos: సాధారణంగా ఎవరైనా సరే తమ సినిమా టైటిల్ .. మరే సినిమా టైటిల్ కి దగ్గరగా లేకుండా చూసుకుంటారు. ఎందుకంటే  ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారని. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు తెరపైకి మూడు సినిమాలు రానున్నాయి. ఈ మూడు టైటిల్స్ లోను నాగేశ్వరరావు అనే పేరు ఉండటం విశేషం. రవితేజ హీరోగా వంశీకృష్ణ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను రూపొందిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాతో తెలుగు తెరకి నుపూర్ సనన్ కథానాయికగా పరిచయమవుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇక మంచు విష్ణు హీరోగా ‘గాలి నాగేశ్వరరావు’ రూపొందుతోంది. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విష్ణు తన సొంత బ్యానర్లో నిర్మిస్తూ ఉండటం విశేషం. కోన వెంకట్ స్క్రీన్ ప్లే – మాటలు సమకూర్చిన ఈ సినిమాలో సన్నీలియోన్ .. పాయల్ కథానాయికలుగా అలరించనున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ సినిమా నిర్మితమవుతోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో మంచు విష్ణు ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే మరో ‘నాగేశ్వరరావు’ తెరపైకి వస్తున్నాడు. ఈ టైటిల్ తో తెరపైకి వస్తున్న హీరో చైతూ. ఆయనతో  పరశురామ్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మహేశ్ తో చేసిన ‘సర్కారువారి పాట’ వసూళ్ల పరంగా దూసుకుపోతున్న వేళ, తన తదుపరి సినిమా కోసం పరశురామ్ రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతోంది. ఈ సినిమాకి ‘ నాగేశ్వరరావు’ టైటిల్ ను ఖరారు చేరేశారనేది తాజా సమాచారం. కథానాయికగా రష్మిక పేరు వినిపిస్తోంది. ఇలా ముగ్గురు ‘నాగేశ్వరరావు’లు రంగంలోకి దిగితున్నారు. ఆడియన్స్ కన్ ఫ్యూజ్ కాకుండా చూసుకోవలసిన బాధ్యత ఈ ముగ్గురు పైనా ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్