Saturday, January 18, 2025
Homeసినిమాఒకే సంవత్సరం మూడు విషాదాలు.. బాధలో మహేష్‌ బాబు

ఒకే సంవత్సరం మూడు విషాదాలు.. బాధలో మహేష్‌ బాబు

మహేష్‌ బాబుకు ఈ సంవత్సరం 2022 ఏమాత్రం కలిసిరాలేదు. ఈ సంవత్సరం జనవరి 8న రమేష్‌ బాబు చనిపోయారు. మహేష్‌ కు అన్నయ్యంటే.. ఎంతో అభిమానం. అందుకనే ఆయన నిర్మాతగా ఫెయిల్యూర్ లో ఉంటే.. మహేష్ తన సినిమాలకు చిత్ర సమర్పకుడిగా అన్నయ్య పేరు వేసి ఆర్థికంగా పూర్తి సహకారాన్ని అందించాడు. ఇప్పుడిప్పుడే అన్నయ్య లేరనే బాధను నుంచి బయటపడుతున్నాడు అనుకునేలోపు అమ్మ ఇందిరా దేవి సెప్టెంబర్ 28న మరణించారు.

అమ్మంటే ఎవరికి ప్రేమ ఉండదు. మహేష్ కి కూడా అంతే.. అమ్మ అంటే ప్రాణం. అమ్మ చేతి పాయసం తాగితే.. దేవుడి గుడిలో ప్రసాదం తీసుకున్నట్టుగా ఉంటుంది అని ఓ వేడుకలో స్వయంగా మహేష్‌ చెప్పారు. అలాంటిది అమ్మ చనిపోయినప్పుడు తట్టులోకపోయాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. షూటింగ్ లకు వెళుతున్నాడు అనుకుంటే.. ఇప్పుడు మహేష్‌ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ నవంబర్   15న ఉదయం 4 గంటలకు చనిపోయారు. ఆయన మరణం ఘట్టమనేని కుటుంబ సభ్యులకే కాదు.. తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు.

ఇలా ఒకే సంవత్సరంలో మహేష్‌ బాబు, అన్నయ్య రమేష్‌ బాబు, అమ్మ ఇందిరా దేవి, నాన్న కృష్ణను కోల్పోవడంతో చాలా బాధపడుతున్నారు. అభిమానులు సైతం తమ అభిమాన హీరో కృష్ణ ఇక లేరు అనే నిజాన్ని నమ్మలేకపోతున్నారు. కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Also Read : ఆకాశంలో ఒక తార – సూపర్ స్టార్ కృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్