ప్రచండ భానుడి ప్రతాపం నుంచి భాగ్య నగరానికి కొంత ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం అక్కడక్కడ వర్షం పడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. దీనికి వర్షం కూడా తోడయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట్, జగద్గిరిగుట్ట, జేఎన్‌టీయూ, ప్రగతినగర్, మూసాపేట్, కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, చింతల్, బాలానగర్, కొంపల్లి, సుచిత్ర, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, మాదాపూర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తున్నది. అయితే జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లపై నీళ్లు నిలువకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్లే వెళ్లిపోయేలా చూస్తున్నారు. దంచికొడుతున్న ఎండలతో పెరిగిన ఉష్ణోగ్రతల నుంచి వర్షాల వల్ల ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.
గురువారం సాయంత్రం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. జగద్గిరిగుట్ట, చింతల్, బాలానగర్, చంపాపేట్, సరూర్‌నగర్, చైతన్యపురిలో వానపడింది. సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగళ్లతో వర్షం కురవగా.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, చిలకలగూడ, మారేడుపల్లితో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే పలుప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది.