బాలివుడ్ హిరో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అభిమానం ముదిరి పాకాన పడింది. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఆదివారం రాత్రి సల్మాన్ ఖాన్ టైగర్ 3 తెరపైకి వచ్చిన సందర్భంగా అభిమానుల బృందం మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణం మోహన్ థియేటర్ వద్ద పటాకులు కాల్చారు. సినిమా స్క్రీనింగ్ సమయంలో కొంతమంది అభిమానులు హాల్ లోపల పటాకులు పేల్చడం సినిమా హాల్ నుండి వచ్చిన క్లిప్‌లో కనిపించింది.
దీంతో సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. థియేటర్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంకొందరు థియేటర్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.
మూవీ తొలి రోజు భారీగా వసూళ్లు రాబట్టింది. గ్లోబల్‌గా, దేశీయంగా కలెక్షన్‌ల వర్షం కురిసింది. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 44 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 94 కోట్ల వసూళ్ళు రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు టైగర్ 3 సినిమా కొట్టింది.
మాలెగావ్ లో ఈ విధంగా టపాసుల పేలుళ్లు ఈ ఏడాది రెండోసారి కావటం గమనార్హం. అక్టోబరు 6న షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాకు కూడా ఇదే విధమైన పేలుడుతో నానా రచ్చ చేశారు.
మైనారిటీల ఆధిపత్యం ఉన్న మాలేగావ్‌లో థియేటర్ ఘటనలు ఉగ్రవాదుల ఉన్మాదాన్ని ప్రతిబింబించాయి. 2006,2008లో అనేక మంది ప్రాణాలను బలిగొన్న నిజ-జీవిత టెర్రర్ బాంబుల జ్ఞాపకాలను గుర్తు చేశాయి. ఈ దఫా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-దేశవేని భాస్కర్