Sunday, September 22, 2024
HomeసినిమాRavi Teja: త్వరలో 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ లుక్

Ravi Teja: త్వరలో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్

రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’  కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి రెండు హిట్ సినిమాలు అందించిన  నిర్మాత అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ మే 24న విడుదల కానుంది.  1970ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌, యాసతో ఆకట్టుకుంటారు.

ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 5 ఎకరాల స్థలంలో సినిమా కోసం స్టువర్టుపురం గ్రామాన్ని రీ-క్రియేట్ చేయడానికి భారీ బడ్జెట్‌ను కేటాయించారు.  ఆర్ మదీ ISC సినిమాటోగ్రాఫర్ కాగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత. ఈ చిత్రం అక్టోబర్ 20 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్