Friday, March 20, 2026
Homeసినిమా‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్

Title Song: శర్వానంద్, రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 25న సినిమా విడుదలవుతుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర అవుతుండటంతో మేకర్స్ సినిమా మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈ సినిమా నుంచి టైటిల్ ట్రాక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

‘హే ల‌క్ష్మ‌మ్మో, ప‌ద్మ‌మ్మో, శాంత‌మ్మో, శార‌ద‌మ్మో..’ అంటూ సాగుతూ భార్యా భ‌ర్త‌లు చేస్తున్న కాపురాలు గురించి సాగుతూ.. త‌న ఫెయిల్యూర్స్‌ కు ఆడ‌వాళ్లే కార‌ణ‌మంటూ స్వీట్‌గా విమ‌ర్శిస్తూ.. చివ‌ర‌కు ఆడ‌వాళ్లు జోహార్లు అంటూ కొన‌సాగే ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. ఈ టైటిల్ ట్రాక్‌ను దేవిశ్రీ ప్ర‌సాద్ పాడ‌టం విశేషం. శ్రీమ‌ణి పాట‌ను రాశారు. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular