టీఎస్‌బీపాస్ దరఖాస్తుదారులు, ఇండ్లు నిర్మించుకొనే వారికి ఎలాంటి సమస్యలు, సందేహాలు, ఫిర్యాదుల కోసం మున్సిపల్ శాఖ సామాజిక మాధ్యమాల్లో, ఫోన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నందున ప్రత్యేక ఖాతాలు తెరిచారు. వాటిపై ప్రజలకు విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నారు. పట్టణాల్లో దరఖాస్తు చేసుకున్న ఇండ్లు, నిర్మించే ఇండ్లపై ప్రజలు ఎలాంటి సందేహాలు, ఫిర్యాదులు, సమాచారం కోసమైనా సంప్రదించవచ్చని అధికారులు చెప్తున్నారు. తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు నిర్మించిన వారిపై ఈ నంబర్లకు సమాచారం ఇస్తే వాటిని పరిశీలించిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు.
టీఎస్‌బీపాస్ సోషల్ మీడియా ఖాతాలు
ట్విట్టర్: @ts_bpass
ఇన్‌స్టాగ్రాం: @ts_bpass
యూట్యూబ్: @ts_bpass
ఫేస్‌బుక్: @officialtsbpass
వెబ్ సైట్: https://tsbpass.telangana.gov.in/
మొయిల్ ఐడీ: [email protected]
టోల్ ఫ్రీ నంబర్: 18005992266
ల్యాండ్ లైన్ ఫోన్: 040-22666666
వాట్సాప్ నంబర్: 9392215407