Sunday, February 23, 2025
HomeTrending NewsRakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత

Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత

టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులు స్వర్గస్తులు అవుతూ అందర్నీ శోక సంద్రంలోకి నెట్టిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్న మాస్టర్.. విశాఖలో ఒక ఈవెంట్ లో పాల్గొనడానికి వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనని గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది.

ఆయన మృతిపట్ల ఆయన అభిమానులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆట డ్యాన్స్ షోతో కెరీర్ ప్రారంభించిన రాకేశ్ మాస్టర్ దాదాపు 1500 సినిమాలకు పైనే పనిచేశారు. గత కొంత కాలంగా ఆయన సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ పలు యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. అవి ఎప్పుడు వార్తాల్లో నిలిచేవన్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్