Sunday, January 19, 2025
Homeసినిమాయంగ్ హీరోల హడావిడి ఎక్కడా కనిపించదేం?!

యంగ్ హీరోల హడావిడి ఎక్కడా కనిపించదేం?!

మొదటి నుంచి కూడా రామ్ హిట్ – ఫ్లాప్ అనే విషయాలను అంతగా పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నాడు. రెండేళ్లుగా ఆయన నుంచి వచ్చిన సినిమాలు పూర్తిగా నిరాశపరిచాయి. తన మార్క్ కథలతో ముందుకు వెళ్లాలా? లేదంటే మాస్ యాక్షన్ సినిమాలను చేయాలా? అనే సందేహం నుంచి ఆయన తేరుకునేలోగా రెండు సినిమాల పరాజయాలు ఆయన ఖాతాలోకి చేరిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆయన బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు.

‘అఖండ’ తరువాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా గురించిన హడావిడి ఎక్కడ కనిపించడం లేదు. ఎంతవరకూ వచ్చిందనే అప్ డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు. బోయపాటి కూడా ఈ సినిమాను గురించి ఎక్కడా ఏమీ మాట్లాడటం లేదు.  దాంతో రామ్ అభిమానులు కాస్త అసహనానికి లోనవుతున్నారు.

ఇక నితిన్ పరిస్థితి కూడా అంతే ఉంది. వరుస ఫ్లాపులతో సతమవుతున్న నితిన్, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి కూడా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. ఇక శర్వానంద్ కూడా శ్రీరామ్ ఆదిత్యతో ఒక సినిమా చేయనున్నట్టు చెప్పారు. ఇందులో కృతి శెట్టి కథానాయిక. ఈ ప్రాజెక్టు గురించి కూడా అప్ డేట్స్ లేవు. యంగ్ హీరోల నుంచి ఎలాంటి హడావిడి కనిపించకపోవడమే ఫ్యాన్స్ నిరాశపరుస్తున్న విషయం.

Also Read: షాకింగ్ లుక్ లో రామ్..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్