Sunday, March 15, 2026
HomeTrending NewsKodangal; కోడంగల్ నుంచి బరిలోకి రేవంత్ రెడ్డి

Kodangal; కోడంగల్ నుంచి బరిలోకి రేవంత్ రెడ్డి

కొడంగల్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీ చేయనున్నారు. ఇవాళ దరఖాస్తు చేయనున్నట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ గాంధీ భవన్ లో దరఖాస్తు చేయనున్నారు. కోడంగల్ కు రేవంత్ వస్తున్నారనే వార్తలతో ఆ ప్రాంత కాంగ్రెస్ నేతల్లో  ఉత్సాహం నెలకొంది.

ఈసారి కొడంగల్‌ కాంగ్రెస్‌దేనంటున్నారు హస్తం నేతలు. కొడంగల్‌లో రేవంత్‌ను గెలిపించే బాధ్యత తీసుకుందామని.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చారన్నారు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి. కాంగ్రెస్‌ నేతలు కన్పిస్తే కొట్టాలని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అంటున్నారని.. ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. ప్రజలు ఓట్లతోనే కొట్టి నరేందర్‌రెడ్డిని ఓడిస్తారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular