Saturday, February 22, 2025
HomeTrending NewsTPCC: ఎమ్మెల్యే టికెట్ ఆశావాహులకు కాంగ్రెస్ విధి విధానాలు

TPCC: ఎమ్మెల్యే టికెట్ ఆశావాహులకు కాంగ్రెస్ విధి విధానాలు

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం హైదరాబాద్ గాంధీ భవన్ లో దరఖాస్తు ఫారాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్ లు విడుదల చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు విధి విధానాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొదటి రోజు 19 దరఖాస్తు ఫారాలు విక్రయం అయ్యాయి.

దరఖాస్తు నిబంధనలు…
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.25వేలు, సాధారణ అభ్యర్థులకు రూ.50వేలుగా దరఖాస్తు రుసుము నిర్ణయించారు. దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదు. శుక్రవారం నుంచి దరఖాస్తుల కార్యక్రమం మొదలైంది. ఈ నెల 25 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుంది. పార్టీకి వారు చేసిన సేవలు, సర్వేలు, గెలుపు ప్రాతిపదికన అభ్యర్థుల నివేదిక తయారు చేస్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్దారించాకే అభ్యర్థులను ఫైనల్ చేస్తారు.

అప్పటివరకు తామే అభ్యర్థులమంటూ ఎవరైనా చర్చించుకున్నా.. అవి ఊహాగానాలే అవుతాయి. అభ్యర్థులు ఫైనల్ అయినట్లు మీడియాలో వచ్చే కథనాలు నమ్మొద్దు. గతంలో హామీ ఇచ్చారని జరిగే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నేతలెవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందే

RELATED ARTICLES

Most Popular

న్యూస్