Tuesday, September 17, 2024
HomeTrending NewsCongress: ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి - రేవంత్ రెడ్డి

Congress: ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి – రేవంత్ రెడ్డి

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సమస్యలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు

తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు కీలక భూమిక పోషించారు. తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు.. అంతా సర్కార్ ఉద్యోగులే ఉంటరు.. సమైక్య పాలకులు కాంట్రాక్టు, ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగులను చాలా బాధలు పెట్టిన్రు.. ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరినీ రెగ్యులర్ చేస్తా అని చాలా సార్లు హామీ ఇచ్చారు. అంతేకాకుండా 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల వెతలు తీరలేదు. క్రమబద్ధీకరణ జరగకపోగా జీతాలివ్వండి మహాప్రభో అని అర్ధించాల్సిన పరిస్థితి మీ పాలనలో దాపురించింది. మే నెలలో రెగ్యులర్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లకూ ఏప్రిల్ నెల జీతం ఇంకా రాలేదు. డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకూ కొన్ని జిల్లాల్లో జీతాలు పెండింగ్లో ఉన్నాయి.
నెలల తరబడి జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏ రోజు జీతం పడుతుందో కూడా తెలియని దుస్థితి. ధనిక రాష్ట్రమని చెప్పుకోవడమే తప్ప కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు వేతనాలు చెల్లించలేని దుస్థితి మీ ప్రభుత్వంలో దాపురించింది. కాంట్రాక్ట్ లెక్చరర్ల కు సకాలంలో జీతాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత మీపైన ఉంది. లేనిపక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడమే కాక… వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతాం.

డిమాండ్లు :
• కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు ఐదారు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలి.
• కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు ప్రతి నెల సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలి.
• వివిధ కారణాలతో రెగ్యులరైజ్ చేయని వారిని తక్షణమే రెగ్యులర్ చేయాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్