గవర్నర్ ప్రసంగం విషయంలో ఈ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు హెడ్ గా గవర్నర్ ఉంటారని అలాంటి వ్యక్తి చేత సిఎం ను పొడిగించారని…. ఇది సంప్రదాయం కాదని స్పష్టం చేశారు. ‘అవర్ డైనమిక్ సిఎం’ అంటూ గవర్నర్ చేత చెప్పించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా గవర్నర్ స్థాయిని తగ్గించడమేనని… ఈ ప్రతిని తయారు చేసేది ప్రభుత్వమే కాబట్టే ఈ తప్పుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేశవ్ డిమాండ్ చేశారు.
సంప్రదాయం ప్రకారం గవర్నర్ కు సాదరంగా ఆహ్వానం పలికి మండలి ఛైర్మన్, స్పీకర్ నేరుగా ఆయన ప్రసంగించే పోడియం వరకూ తోడ్కొని వస్తారని, కానీ గవర్నర్ ను కూడా స్పీకర్ రూమ్ లో కాసేపు వెయిట్ చేయించారని, ఇది సరైన విదాయన్ కాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తప్ప మరే వ్యవస్థలూ రాజ్యాంగంలో కనిపించవా అంటూ ప్రశ్నించారు.
ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్టు- హైకోర్టు జడ్జిల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరించిన గతంలో చూశామని… ఇప్పుడు గవర్నర్ స్థాయిని తగ్గించే విధంగా నేడు చేశారని అభ్యంతరం వెలిబుచ్చారు.
Also Read : గవర్నర్ ప్రసంగం: టిడిపి సభ్యుల బాయ్ కాట్