Monday, March 16, 2026
HomeTrending NewsCPR:సిపిఆర్ తో గుండె పోటు మరణాలు తగ్గించవచ్చు

CPR:సిపిఆర్ తో గుండె పోటు మరణాలు తగ్గించవచ్చు

ఆకస్మిక గుండెపోటు వల్ల వ్యక్తులు మరణించకుండా సిపిఆర్ చేయడం వలన ప్రాణాలను కాపాడిన వారం అవుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సిపిఆర్ పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా ఆకస్మిక గుండెపోటు వల్ల అనేకమంది మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలు బాధను కలిగిస్తున్నాయన్నారు. ఆకస్మిక గుండెపోటు వల్ల సంభవించే మరణాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్డియో పల్మనరీససీటేషన్ పై వైద్య ఆరోగ్యశాఖతోపాటు సాధారణ ప్రజలందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వ హించాలన్నారు. జీవన విధానంలో మార్పులు, వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్లు, ప్రకృతి వ్యతిరేకంగా జరుగుతున్న పరిమాణాలు, పని ఒత్తిడి, పనులలో పోటీ తత్వం, మనిషి యొక్క ఆశలు ఎక్కువగా పెంచుకోవడం వల్ల మనసు మీద ఒత్తిడి ఎక్కువ అవుతుందన్నారు. తదితర కారణాలవల్ల వయస్సు నిమిత్తం లేకుండా గుండెపోట్లు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

సిపిఆర్ శిక్షణ వల్ల 50 శాతం గుండెపోటు మరణాలను తగ్గించవచ్చని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో వేగంగా మార్పులు తీసుకువచ్చిందని, గతంలో ప్రభుత్వ దవాఖానాలకు పోవద్దని దానిపై పాటలు కూడా పాడేవారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడడంతో ప్రజలు అధిక సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులను వెళుతున్నారని వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలు బాగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. సి పి ఆర్ ఫై ప్రతి కుటుంబానికి తెలిసేలా అవగాహన కల్పించాలని, పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని మంత్రి ఆదేశించారు.
జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ మాట్లాడుతూ ముందుగా వైద్య సిబ్బందికి తర్వాత పోలీసు మిగిలిన అన్ని శాఖలకు, ఐదుగురు రిసోర్స్ పర్సన్ ద్వారా ట్రైనింగ్లు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. గుండెపోటు వచ్చి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే లోపు సిపిఆర్ ఇచ్చినట్లయితే మనిషి బ్రతికేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని అదనపు కలెక్టర్ అన్నారు. తీసుకున్నవారు వీలైనంత ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వాలని దీనిని సామాజిక బాధ్యతగా తీసుకున్నట్లయితే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు అని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, జెడ్పి చైర్మన్ గొప్పగాని వెంకటనారాయణ గౌడ్ ,జడ్పిటిసి జీడి బిక్షం, జిల్లా ఆధనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు,dmho కోటాచలం, డిప్యూటీ డిమాండ్ హెచ్ ఓ హర్షవర్ధన్, డాక్టర్ కళ్యాణ్ , కార్యాలయ ఎఓ శ్రీదేవి, ఆర్డిఓ రాజేంద్రకుమార్, డిఎస్పి నాగభూషణం, మాస్టర్ ట్రైనిస్ ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular