Sunday, January 19, 2025
HomeTrending Newsరైతుబంధు పరిగె కాదు పరమాన్నం

రైతుబంధు పరిగె కాదు పరమాన్నం

కరోనా వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మన రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం ఆగలేదని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. పేద బిడ్డల పెళ్లి అయిన నెల లోపు కళ్యాణలక్ష్నీ/ షాదీ ముబారక్ చెక్కులు మంజూరవుతున్నాయని తెలిపారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, CMRF, కళ్యాణలక్ష్మీ, షాదిముభారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు, కేసీఆర్ కిట్టు , తెలంగాణ దళిత బంధు పథకాలు కేసీఆర్ గొప్ప ఆలోచనల నుండి వచ్చినవన్నారు. సంపద సృష్టించడమే కాదు, అది ప్రజలకు పంచిన ఘనత కూడా కేసీఆర్ దే అన్న మంత్రి ప్రజల డబ్బులు ప్రజలకే పంచుతుంటే కొందరు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు.

రైతుబంధును పరిగె అని ఓ నాయకుడు మాట్లాడటం, ఆయన దిగజారుడు తనంకు నిదర్శనమని మంత్రి దుయ్యబట్టారు. రైతులను ఆదుకోవడం, పేద బిడ్డలకు పెళ్లి చేయడం విపక్ష నేతలకు పరిగె లాగా కనిపిస్తోందని, పరిగే కాదది .. పేదలకు పరమాన్నం అన్నారు. పేదరికం పోగొట్టాలని , ఆర్థిక అసమానతలు రూపుమాపాలని సీఎం కేసీఆర్ తపనపడుతున్నారని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్