Tuesday, March 10, 2026
Homeసినిమా‘వరుణ్ డాక్టర్’ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

‘వరుణ్ డాక్టర్’ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

అనగనగా ఓ డాక్టర్… అతని పేరు వరుణ్. అతనికి ఓ కుటుంబం ఉంది. అయితే.. అది సొంత కుటుంబం కాదు. అందరూ కలిసి కుటుంబంలా నటిస్తూ, కిడ్నాప్ లు చేస్తుంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ (అమ్మాయిల అక్రమ రవాణా)కు, డాక్టర్ చేయించే కిడ్నాప్ లకు సంబంధం ఏమిటి? వైద్యం చేయాల్సిన డాక్టర్ గన్ చేతపట్టి హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాలోకి ఎందుకు వచ్చాడు? దాన్ని ఎలా అరికట్టాడు? అనేది తెలియాలంటే విజయదశమి కానుకగా విడుదలవుతున్న ‘వరుణ్ డాక్టర్’ చిత్రాన్ని థియేటర్లలో చూడాల్సిందే.

‘రెమో’, ‘సీమ రాజా’, ‘శక్తి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వరుణ్ డాక్టర్’. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్. స్టూడియోస్ అధినేత కోటపాడి జె. రాజేష్ ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె. ప్రొడక్షన్స్ సంస్థలతో సంయుక్తంగా నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 9న ‘డాక్టర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు.‌ దానికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. 1.5 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

ఈ సందర్భంగా నిర్మాత కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ… “శివ కార్తికేయన్ గారికి తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. ట్రైలర్ కు లభిస్తున్న స్పందన అందుకు ఉదాహరణ.‌ త్వరలో తెలుగు పాటలను విడుదల చేస్తాం. విజయదశమికి ప్రేక్షకులందరూ కుటుంబంతో కలిసి చూసే చక్కటి చిత్రమిది” అని అన్నారు.

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ “ఇదొక మాస్ ఎంటర్టైనర్. ట్రైలర్ కు అన్నివర్గాల ప్రేక్షకుల నుండి చక్కటి స్పందన లభించడం సంతోషంగా ఉంది. సినిమా సైతం ప్రేక్షకులు అందరినీ తప్పకుండా అలరిస్తుందని చెప్పగలను” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular