Saturday, January 18, 2025
Homeసినిమాత్రిష నుంచి మరో సైకో థ్రిల్లర్ గా 'బృంద' 

త్రిష నుంచి మరో సైకో థ్రిల్లర్ గా ‘బృంద’ 

త్రిష ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. మరో వైపున భారీ వెబ్ సిరీస్ లు చేయడంతోను బిజీగా ఉంది. ఆమె నుంచి మరో సైకో థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది ..  ఆ సిరీస్ పేరే ‘బృంద’. రమేశ్ చంద్ నిర్మించిన ఈ సిరీస్ కి సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించాడు. శశికాంత్ కార్తీక్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సిరీస్, ఆగస్టు 2వ తేదీ నుంచి ‘సోనీ లివ్’లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు.

రీసెంటుగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ‘బృంద’ ఓ పోలీస్ ఆఫీసర్. ఓ పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ.గా పనిచేస్తూ ఉంటుంది. ఒక వైపున ఆమెకు ఒక ‘పీడ కల’ తరచూ వస్తూ ఉంటుంది. అయితే అవి తన గతానికి సంబంధించిన దృశ్యాలు అని తెలుసుకుని, తన గతానికి సంబంధించిన ఆలోచన చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే నగరంలో వరుసగా దారుణమైన హత్యలు  జరుగుతూ ఉంటాయి. ఈ కేసు విషయంలో ఆమె పైఅధికారుల అసహనానికి గురవుతుంది.

‘బృంద’ గతం ఏమిటి? ఆమె గతం ఆమెను ఎందుకు వెంటాడుతోంది? వరుస హత్యలు చేస్తున్నది ఎవరు? అందుకు కారణాలు ఏమిటి? అనేవి ఈ కథలో ఆసక్తిని రేకెత్తించే అంశాలు.గతంలో ఈ తరహా జోనర్లో త్రిష నాయిక ప్రధానమైన పాత్రలు చేసింది. అలాంటి సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి కూడా. ఇక వెబ్ సిరీస్ లో మాత్రం ఇదే ఫస్టు టైమ్ అనుకోవాలి. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషలలోను ఈ సిరీస్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్