Tuesday, March 10, 2026
HomeసినిమాBusy Star: త్రిషకి మళ్లీ పెరుగుతున్న డిమాండ్!

Busy Star: త్రిషకి మళ్లీ పెరుగుతున్న డిమాండ్!

టాలీవుడ్ తెరపై త్రిష ఒక పుష్కర కాలం పాటు ఒక వెలుగు వెలిగింది. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రెండు భాషలకి చెందిన స్టార్ హీరోలతో కలిసి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత నుంచి తెలుగులో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ స్థాయిలో కాకపోయినా, తమిళంలో కూడా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఆ సమయంలో త్రిష లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ వెళ్లింది. ఈ తరహా సినిమాలు చేయడంలో నయన్ తరువాత స్థానం తనదే అనిపించుకుంది.

ఒకానొక దశలో త్రిషకి స్టార్ హీరోల సరసన ఏ సినిమాలు లేని పరిస్థితి వచ్చింది. అయినా త్రిష డీలాపడిపోలేదు. టాలీవుడ్ నుంచి కొన్నేళ్ల పాటు ఆమెకి ఒక్క పిలుపు కూడా వెళ్లలేదు. అయినా ఆమె బెంగ పెట్టుకోలేదు. ఇక్కడి ప్రేక్షకులు దాదాపు ఆమెను మరిచిపోయే స్థితికి వెళ్లిపోయారు. అలాంటి పరిస్థితుల్లోనే ‘పొన్నియిన్ సెల్వన్’ వచ్చింది. ఈ సినిమాలో త్రిష గ్లామర్ చూసి అంతా షాక్ అయ్యారు. ఒకప్పటికంటే ఆమె ఇప్పుడే ఇంకా బాగుందని చెప్పుకున్నారు. ఇదెలా సాధ్యమంటూ ఆశ్చర్యపోయారు. ఆ సినిమా తరువాత త్రిష గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

త్రిషకి ‘లియో’ సినిమాలో విజయ్ జోడీగా ఛాన్స్ వచ్చింది. చాలా గ్యాప్ తరువాత ఆయనతో కలిసి ఆమె చేసిన సినిమా ఇది. తమిళంతో పాటు సమానంగా ఈ సినిమా తెలుగులోను విడుదలవుతోంది. ఈ సినిమా తరువాత త్రిష మళ్లీ తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ బలంగానే వినిపిస్తోంది. టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలకు సరైన జోడీ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అందువలన త్రిష ఇక్కడ మళ్లీ తన జోరును కొనసాగించడం ఖాయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular