Saturday, January 18, 2025
Homeసినిమామరోసారి వెంకటేశ్ తో జోడీ కడుతున్న త్రిష!

మరోసారి వెంకటేశ్ తో జోడీ కడుతున్న త్రిష!

త్రిష ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఒకానొక సమయంలో ఆమెకి స్టార్ హీరోల సినిమాలలో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ సమయంలో ఆమె నాయిక ప్రధానమైన సినిమాలను చేస్తూ వెళ్లింది. అయితే ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా సమయంలో ఆమె మరింత గ్లామరస్ కనిపించింది. గతంలో కంటే త్రిష ఇప్పుడే బాగుందని అన్నవారూ ఉన్నారు. ఆ సినిమా నుంచి ఆమెకి మళ్లీ అవకాశాలు జోరందుకున్నాయి. అలా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమానే ‘లియో’.

తమిళంలో త్రిష చేస్తున్న సినిమాల సంగతి అలా ఉంచితే, తెలుగులో సీనియర్ స్టార్ హీరోల సినిమాల నుంచి ఆమెకి అవకాశాలు బాగానే వెళుతున్నాయి. ఏకంగా ఆమె మెగాస్టార్ సరసన ‘విశ్వంభర’ సినిమాలో చేసే ఛాన్స్ కొట్టేసింది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో ఆమె ప్రధానమైన నాయిక. ఆల్రెడీ షూటింగులో ఆమె పాల్గొంటూనే ఉంది. గతంలో చిరంజీవి సరసన ఆమె చేసిన ‘స్టాలిన్’ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

ఇక వెంకటేశ్ సరసన మరోసారి సందడి చేసే అవకాశాన్ని కూడా త్రిష దక్కించుకుందని తెలుస్తోంది. వెంకటేశ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాయికగా త్రిషను తీసుకున్నట్టు సమాచారం. గతంలో వెంకటేశ్ – త్రిష కాంబినేషన్లో వచ్చిన సినిమాలలో ‘బాడీ గార్డ్’ మినహా, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ .. ‘నమో వేంకటేశ’  నిమాలు విజయాలను అందుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్