Friday, March 13, 2026
Homeసినిమాఅదే జరిగితే .. త్రిష దశ తిరిగినట్టే!

అదే జరిగితే .. త్రిష దశ తిరిగినట్టే!

Good to See: తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా త్రిష ఒక వెలుగు వెలిగింది. ఈ రెండు భాషల్లోను స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ  ఇచ్చింది. త్రిషను దాటుకుని ఒక అవకాశం ఇతర హీరోయిన్స్ కి వెళ్లడం చాలా కష్టమయ్యేది. ఇటు టాలీవుడ్ లోను .. అటు కోలీవుడ్ లోను ఆమె స్టార్ హీరోల జోడీగా దూసుకుపోయింది. వరుసగా భారీ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సమయంలో ఆమె భారీ పారితోషికమే అడిగినా నిర్మాతలు వెనకడుగు వేయలేదు. క్రేజ్ ను .. హిట్స్ ను తోడు చేసుకుని ఆమె చాలా దూరమే ప్రయాణం చేసింది.

తెలుగు విషయానికి వస్తే ఆమె ఇక్కడ చేసిన సినిమాల్లో ‘వర్షం’ .. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ .. ‘అతడు’ .. ‘కృష్ణ’ .. వంటి భారీ విజయాలు కనిపిస్తాయి. అలాంటి త్రిషకి తెలుగులో అవకాశాలు తగ్గిపోయి చాలాకాలమే అయింది. తమిళంలో కూడా నాయిక ప్రధానమైన సినిమాలనే ఎక్కువగా చేస్తూ వెళుతోంది. ఆ తరహా సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి కూడా. అలాంటి త్రిష ‘చంద్రముఖి 2’లో టైటిల్ రోల్ పోషించనుందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. లారెన్స్  హీరోగా ఈ సినిమాను పి. వాసు రూపొందిస్తున్నాడు.

తమిళంతో పాటు తెలుగులోను ‘చంద్రముఖి’ ఏ స్థాయిలో వసూళ్ల వర్షాన్ని కురిపించిందో తెలిసిందే. అలాంటి ఆ సినిమా  సీక్వెల్ గానే ‘చంద్రముఖి 2’ నిర్మితమవుతోంది. ‘నాయిక’ .. ‘అరణ్మనై 2′(కళావతి) .. ‘మోహిని’ వంటి  హారర్ నేపథ్యంలోని సినిమాలను చేసిన అనుభవం త్రిషకు ఉంది. అందువలన ఈ సినిమాలో ఆమెను తీసుకున్నారని చెప్పుకుంటున్నారు.  అదే నిజమైతే  త్రిష దశ తిరిగినట్టే అనుకోవాలి. ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు .. మేకర్స్ కి ఆమె చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే  జరుగుతుందేమో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular