Sunday, September 8, 2024
Homeసినిమాత్రివిక్ర‌మ్ డైరెక్షన్ లో బన్నీ?

త్రివిక్ర‌మ్ డైరెక్షన్ లో బన్నీ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రాలు రూపొందాయి. ఈ మూడు చిత్రాలు ఇద్ద‌రికీ మంచి పేరు తీసుకువ‌చ్చాయి. న‌టుడుగా స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి అల్లు అర్జున్ కి మంచి పేరు తీసుకువ‌స్తే.. అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రం భారీ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన సినిమాగా నిలిచింది. దీంతో వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో అల్లు అర్జున్ న‌టిస్తున్నారు. అయితే… సినిమా కాదు.. ఓ యాడ్ కోసం. పుష్ప సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ కు క్రేజ్ బాగా పెర‌గ‌డంతో మ‌రి కొన్ని సంస్థ‌లు బ‌న్నీతో ప్ర‌చారం చేయించుకుంటున్నాయి. తెలుగులో మ‌హేష్ బాబు త‌ర్వాత ఆ స్థాయిలో ప‌లు డిఫ‌రెంట్ బ్రాండ్స్ కు ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్నారు. ఇప్పుడు ఓ బ్రాండ్ కోసం చేస్తున్న యాడ్ ని త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ యాడ్ షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేశారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇక వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా ఎప్పుడు చేస్తారంటే.. పుష్ప 2 త‌ర్వాత బ‌న్నీ కొర‌టాల‌తో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు తెలిసింది. ఆత‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో బ‌న్నీ సినిమా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ఈసారి బ‌న్నీని త్రివిక్ర‌మ్ ఎలా చూపిస్తారో చూడాలి.

Attachments area
RELATED ARTICLES

Most Popular

న్యూస్