మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో మహేష్ కు జంటగా మీనాక్షి చౌదరి, శ్రీలీల నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన గుంటూరు కారం టీజర్ సినిమా పై మరింతగా అంచనాలను పెంచేసింది. అయితే.. ఈ సినిమాకు అడుగడుగునా అడ్డంకులు వస్తుండడంతో అసలు ఈ మూవీ ఉంటుందా..? ఆగిపోతుందా..? అనే అనుమానాలు కూడా వచ్చాయి.
అయితే.. ఆ అన్ని అనుమానాలకు ఫుల్ స్టాప్ పడింది. తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. త్రివిక్రమ్ తన సినిమాల టైటిల్స్ ను అ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేలా పెడుతుంటారు. ఈ సినిమాకి కూడా అలాగే పెట్టాలి అనుకున్నారు కానీ.. మహేష్ గుంటూరు కారం టైటిల్ బాగుందని చెప్పడంతో త్రివిక్రమ్ సెంటిమెంట్ ని పక్కనపెట్టేశారు. ఈ మూవీ టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. టైటిల్ విషయంలో సెంటిమెంట్ పక్కన పెట్టేసిన త్రివిక్రమ్ మరో సెంటిమెంట్ ఫాలో అవుతున్నారట.
అదే బ్రహ్మి సెంటిమెంట్. అతడు, అత్తారింటికి దారేది, అల.. వైకుంఠపురుములో చిత్రాల్లో బ్రహ్మానందం నటించారు. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి. అందుకనే గుంటూరు కారంలో కూడా బ్రహ్మానందంతో క్యామియో రోల్ అయినా చేయించాలి అనుకుంటున్నారట. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు.